35. నమ్మకాలు-Instant Results

నమ్మకాలు-Instant Results

 

మీరు ఏర్పరుచుకున్న నమ్మకాలే మీ జీవితాన్ని నడిపిస్తున్నాయి. కాబట్టి మీ జీవితం మారాలి అంటే మీరు ఎరుకలో ఉండి నమ్మకాలను మార్చాలి. అప్పుడే మీరు కొత్త కొత్త అనుభవాలను పొందుతారు. లేకుంటే అవే పాత అనుభవాలు కొనసాగుతాయి. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటనుఅలాగే ప్రతి ఆలోచనను గమనిస్తూవాటికి సంబంధించిన నమ్మకాలను వదిలేసి కొత్త నమ్మకాలను ఏర్పరుచుకోండి.

 

దృష్టిని బట్టి సృష్టిస్థితిని బట్టి గతియద్భావం తద్భవతి అనే అపరిమితమైన నమ్మకాలను (UnLimited Beliefs) ఏర్పరుచుకుని వాటిని మీరు గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే ఇవి మీకు ఎప్పుడు కొత్త కొత్త అనుభవాలను ఇస్తూనే ఉంటాయి కాబట్టి. మీ దృష్టినిమీ స్థితినిమీ భావనను మార్చుకున్న వెంటనేదానికి తగ్గట్టు బాహ్యంగా ఫలితం కూడా మారుతుంది.

 

Limited Beliefs

 

కాబట్టి చలనం లేని పరిమితమైన నమ్మకాలను (Limited Beliefs, Controlled Beliefs) లేదా స్థిరమైన అభిప్రాయాలనుఅంటే...

బీపీ ఇంతే ఉండాలిషుగర్ ఇంతే ఉండాలి,

శరీరం యొక్క బరువు ఇంతే ఉండాలి

వయసు పెరిగినా కొద్ది శరీరం క్షీణిస్తుంది,

ఇది మంచి ఆహారంఅది చెడ్డ ఆహారంఅనారోగ్య సమస్యలకు పరిష్కారం లేదు,

ఆర్థికంగా ఎప్పుడు లోటు ఉంటుందిబంధాలకు అతీతంగా చేరలేము,

కోపం ఉండకూడదుఎప్పుడూ శాంతంగానే ఉండాలి,

ఇది మంచి గుణంఅది చెడ్డ గుణం,

ఇది మంచి ఆలోచన అది చెడ్డ ఆలోచన,

ఇది మంచి ఎమోషన్ అది చెడ్డ ఎమోషన్, 

ఇది మంచి అనుభూతి అది చెడ్డ అనుభూతి,

శరీరం మనసు మరియు గుణాల చేతిలో నేను కీలుబొమ్మను.

ఆడేది నేను ఆడించేది దైవం,

కార్యము నేను కారణం దైవం,

పరిమితము నేను అపరిమితము దైవం,

ఏది నా చేతిలో లేదు,

ఇది పాపంఅది పుణ్యంపాప-పుణ్యాలకు అతీతంగా చేరలేను,

ప్రారబ్దం ప్రకారమే మన జీవితం నడుస్తుందిఅనుకున్న వెంటనే ఫలించదు,

నేను మంచిగా లేదా ప్రశాంతంగా ఉంటేనే దేవుడు ప్రత్యక్షమౌతాడు,

ఇది మంచి ప్రదేశంఅది చెడ్డ ప్రదేశంఇది కలుషిత వాతావరణం,

ఇది మాయా ప్రపంచంనేను ఒకసారి ఒకే శరీరంలో ఒకే ప్రాంతంలో ఉంటాను,

అందరం ఒకే ప్రపంచంలో ఉన్నాము,

ఇది మంచి కాలంఅది చెడ్డ కాలంఇది మంచి సమయంఅది చెడ్డ సమయం,

ఈ గ్రహాలు మంచివిఆ గ్రహాలు చెడ్డవి,

ఇది కలియుగంనాది పరిమిత శరీరంనాది పరిమిత మనసు,

నా ఇంద్రియాలు శరీరం వరకే పరిమితమై ఉన్నాయి... మొదలగు ఎదుగుదలకు అవకాశం లేని నమ్మకాలను వదిలేయండి. ఎందుకంటే ఇవి మిమ్మల్ని పరిమితం చేసి బంధిస్తాయి కాబట్టి.

 

UnLimited Beliefs

 

అనుకున్నవన్నీ జరగాలి అనే కోరిక మనందరికీ ఉంటుంది కాబట్టి, నేను సూచించే ఈ స్వేచ్ఛతో కూడిన నమ్మకాలను ఎంపిక చేసుకోండి (Choose Freedom Beliefs, UnLimited Beliefs):

నేను పెట్టుకునే సంకల్పానికి నేను పోషించే పాత్రకు తగ్గట్టు –

బీపీ షుగర్ రీడింగ్స్ ఉండాలిశరీరాకృతి ఉండాలిశరీర బరువు ఉండాలి,

ఎప్పుడు శరీరం తాజాగా నవ్యనూతనంగా దివ్యంగా ఉంటుంది,

అన్ని దివ్యమైన ఆహారాలేఅన్ని దివ్యమైన గుణాలే, అన్ని దివ్యమైన ఆలోచనలే, అన్ని దివ్యమైన ఎమోషన్లే, అన్ని దివ్యమైన అనుభూతులే, అన్ని దివ్యమైన కాలాలే,

అన్ని దివ్యమైన సమయాలేఅన్ని దివ్యమైన ప్రదేశాలేఅన్ని దివ్యమైన గ్రహాలే,

అన్ని దివ్యమైన యుగాలేఇది దివ్యమైన వాతావరణం,

శరీరం మనసు మరియు గుణాలు నా చేతిలో కీలు బొమ్మలు,

ఆడేది దైవమే ఆడించేది దైవమే లేదా ఆడేది నేనే (creation) ఆడించేది నేనే (creator),

కార్యము దైవమే కారణమూ దైవమే లేదా కార్యము నేనే కారణమూ నేనే,

పరిమితము దైవమే అపరిమితమూ దైవమే లేదా పరిమితము నేనే అపరిమితమూ నేనే

విశ్వమంతా నా చేతిలో ఉంది,

నేను ఎలా ఉన్నా దేవుడు ప్రత్యక్షమౌతాడు,

అందరం ఒకే ప్రపంచంలో లేము ఎవరి ప్రపంచంలో వాళ్లు ఉన్నారు,

ఇది దివ్యమైన ప్రపంచంనేను ఒకేసారి అనేక శరీరాలలో అనేక ప్రాంతాలలో ఉంటాను,

అనంతమైన విశ్వ శరీరమే నా శరీరంఅనంతమైన విశ్వ మనసే నా మనసు,

నా ఇంద్రియాలు అనంతంగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి,

అన్ని అనారోగ్య సమస్యలకు దివ్యమైన పరిష్కారం ఉంది,

ఆర్థికంగా ఎప్పుడు సమృద్ధిగా ఉంటాను,

బంధాలకతీతంగా సులభంగా చేరుతాను,

పాపపుణ్యాలకు అతీతంగా సులభంగా చేరుతాను,

అనుకున్న వెంటనే ఫలిస్తుంది,

శరీరం ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,

మనసు ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,

బుద్ధి ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,

ఎవరు ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,

ప్రపంచం ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,

సమస్యలలో కష్టసుఖాలలో కూడా నేను ఆనందంగా ఉంటాను,

ఉచ్చ-నీచ స్థితులలో కూడా నేను ఆనందంగా ఉంటాను,

వర్తమాన స్థితి ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను,

ప్రారబ్ధం ప్రకారం కాకుండా ఆనందంగా ఉన్నప్పుడు నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది...

ఈ విధమైన స్వేచ్ఛతో కూడిన నియమాలులేని (unconditional) నమ్మకాలను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే నేను అంటేనే దేని మీద ఆధారపడని ఆనందం (Independent Bliss).

 

కనుక పరివర్తనకు అవకాశం లేని నమ్మకాలను గట్టిగా పట్టుకోవడం మూఢనమ్మకమే అవుతుంది. ఎందుకంటే కదిలే శక్తి యొక్క తత్వం ఎప్పుడు మారుతూ పరివర్తన చెందుతూనే ఉండడం. కనుక పరిమిత నమ్మకాలన్నీ మూఢనమ్మకాలేనని ఇక్కడ గ్రహించండి.

 

అందువలన మీరు ఎప్పుడూ తెరిచిన మనసుతోతెరిచిన హృదయంతో ఉండండి.

అంటే యద్భావం తద్భవతిదృష్టిని బట్టి సృష్టిస్థితిని బట్టి గతి,

ఏదైనా సరే అనుకున్న వెంటనే ప్రత్యక్షమౌతుంది మాయమౌతుంది...

ఇలాంటి స్వేచ్ఛతో కూడిన అపరిమితమైన నమ్మకాలను గట్టిగా పట్టుకోండి.

 క్లుప్తంగా చెప్పాలంటే: నా పేరు ఇది, నా రూపం ఇలా ఉంటుంది,  నా రంగు ఇది, నా శరీరం బరువు ఇంత,  నా ఊరు ఇది, నేను ఆ రోజు పుట్టాను, ఇప్పుడు నా వయసు ఇంత, నేను ఈ ఊర్లో పుట్టాను, నేను ఈ ప్రాంతంలో పెరిగాను, నేను ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నాను, నా గోత్రం ఇది, నా కులం ఇది, నా మతం ఇది, నా ప్రాంతం ఇది, నేను ఈ దేశంలో పుట్టాను, నేను మంచి  వాడిని, నాకు ఇంత ఆస్తి ఉంది, నేను భూమి మీద ఉన్నాను...మొదలైనవి పరిమిత నమ్మకాలని;

అలాగే అన్ని పేర్లు నావే, అన్ని రూపాలు నావే, అన్ని రంగులు నావే,  నేను పుట్టలేదు, నాకు వయసు లేదు,  అన్ని ఊర్లు నావే,  అన్ని కులాలు నావే, అన్ని మతాలు నావే, అన్ని ఆస్తుల అప్పులు నావే, అన్ని గుణాలు నాకు ఉన్నాయి గుణాలకు అతీతంగా కూడా నేను ఉన్నాను, నేను విశ్వమంతా వ్యాపించి ఉన్నాను... మొదలైనవి అపరిమితమైన నమ్మకాలని ఇక్కడ గ్రహించండి.

 

ఒరిజినల్ దైవం-Man Made God

 

ఈ సృష్టిలో కదలని శక్తి చైతన్యం 50%అన్ని వైపులా కదిలే నిరాకార శక్తి-చైతన్యం 49%శక్తి-చైతన్యంతో తయారైన నామరూపక్రియలు 1% ఉంటాయి. అంటే నిరాకారం 99% - ఆకారాలు 1%కదిలేవి 50%కదలనిది 50% ఉంటాయన్నమాట. ఈ నిరాకార శక్తి-చైతన్యం యొక్క కలయికను సచ్చిదానంద స్వరూపం అని కూడా అంటారు.

 

 ఈ కదిలే 49% శక్తి అలాగే కదలని 50% శక్తి - ప్రత్యక్షం అవ్వకుండా ఎవరు ఏది అడ్డుకోలేవు. ఎందుకంటే ఇవి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండిసదా ప్రత్యక్షమయ్యే(Omnipresent) ఉంటాయి. అలాగే ఈ దైవం నిరాకారంగా ఉంటూనేజీవజగదీశ్వర్లుగా కూడా ఒకేసారి నటిస్తున్నాడు (Monism). కనుక నిరాకారాన్ని మరియు ఆకారాన్ని విడదివ్వలేము. అవి ఎప్పుడు పాలు నీళ్ళలాబొమ్మ బొరుసులా కలిసి ఏకమయ్యే ఉంటాయి.

 

 కనుక అన్నింటినీ చూస్తున్నప్పుడు  - ఇది నిరాకారమనిఅది ఆకారమనిఇది ఆరోగ్యమని అది అనారోగ్యమనిఇది మంచిదనిఅది చెడ్డదనిఇది కుర్చీ అనిఅది మంచం అనిఇది ప్రపంచమనిమనం జీవులమనిఎక్కడో దేవుడు ఉన్నాడనిఇలా అన్నింటినీ నిర్ణయించివాటిని నామరూప క్రియలతో బంధించిదానిని గుడ్డిగా నమ్మకండి.

 

ఎందుకంటే మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా దాని విలువ కేవలం 1% మాత్రమేఅలాగే నేను మాటల రూపంలో చెప్పే ఎంత గొప్ప పరిష్కారమైన దాని విలువ కూడా 1% మాత్రమే. 

   కనుక దేనిని చూస్తున్నా

నేను రూపంగా 1% నిరాకారంగా 99% ఉన్నాను,

నువ్వు కూడా రూపంగా 1% నిరాకారంగా 99% ఉన్నావు అని జడ్జ్ చేయండి.

అంటే నువ్వు పరిమితంగా 1% అపరిమితంగా 99% ఉన్నావునేను పరిమితంగా 1% అపరిమితంగా 99% ఉన్నాను అని జడ్జ్ చేయండి.  కాబట్టి 1% మాత్రమే ఉన్న ద్వంద్వాల మీద దృష్టి పెట్టకుండా99% ఉన్న మౌనం లేదా దైవం లేదా ఏకత్వం మీద మీ దృష్టిని నిలపండి.

 

అలాగే దైవం లేదా శక్తి-చైతన్యం సహాయం చేయకుండా నేను ఏమి చేయలేనుదైవం చేతిలో నేను కీలుబొమ్మనుఉన్నది అపరిమితమైన నేనునే అపరిమిత దైవమే (Omnipresence means all-present), అసలు పరిమితమైన నేనుకు ఉనికే లేదు కనుక స్వయంగా నేను ఏమి చేయలేననిఅజ్ఞానం వలన  పాప పుణ్యాలు నేనే చేశానని ఇంత వరకు గుడ్డిగా నమ్మాననే విషయాన్ని మీరు గుర్తించండి.

 ఇన్ని రోజులు నేను చేసిన పాపాల వల్లనే దైవం ప్రత్యక్షం కావట్లేదు అని మనం గట్టిగా నమ్ముతున్నాం. కనుక కర్మ-తలరాత-ప్రారబ్ధం అందుకే దైవం ప్రత్యక్షం కావట్లేదుఇలాంటి నమ్మకాలను కూడా గట్టిగా పట్టుకోకుండావాటితో అంటి ముట్టనట్టుగా ఉండండి.

 

నా పరిమిత నమ్మకాలకు ప్రభావితమై అంతటా ప్రత్యక్షం కాలేని దైవం నాకు వద్దు అని భావిస్తూ ఆ దైవాన్ని వదిలేయండి. ఎందుకంటే మన అవగాహననుమన అనుభవ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనమే ఈ దైవాన్ని ఊహించి సృష్టి చేశాం కనుక (Man made God). ఇతను మనల్ని సృష్టించిన ఒరిజినల్ దైవం కాదు కనుక.

 

వర్ణనాతీతం

 

సృష్టించిన వాడికి సృష్టి మీద హక్కు ఉండదు అనే నమ్మకాలు మనకు ఉన్నాయి. ఇక్కడ జీవ జగదీశ్వరులు సృష్టిఅపరిమిత దైవం సృష్టికర్త(Omnipotence, meaning all-powerful). సృష్టించిన దైవానికి సృష్టి మీద సర్వహక్కులు ఉంటాయి. ఆయన ఎప్పుడంటే అప్పుడు దేనినైనా సృష్టించి ఇక చాలు అని అనుకున్న వెంటనే దానిని లయం కూడా చేయగలుగుతాడు.

 

జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా పర్ఫెక్ట్‌గా దివ్యంగా ఉంది అనే భావనలో సదా ఉంటాడుఎందుకంటే తనకు అన్యం లేదు కనుక. ప్రతి కదలిక భగవంతుడేమనమే కదులుతున్నాం అని భ్రమ పడుతున్నాము. కనుక మన జీవితం మన చేతిలో ఏమాత్రం లేదుగతము భవిష్యత్తు వర్తమానాల గురించి తెలిసిన దైవం చేతిలో(Omniscience, meaning all-knowing) అంతా ఉన్నదని గ్రహించి దైవానికి సరెండర్ అవ్వండి.

 

ఒరిజినల్ దైవం యొక్క స్థితినిఆయన గుణగణాలనుఆయన స్పందించే తీరునుఆయన ఎవరికి ముక్తిని ప్రసాదిస్తాడు మొదలైన విషయాల గురించి మనం మాటలలో స్పష్టంగా వర్ణించి చెప్పలేము. ఎందుకంటే ఆయన వర్ణనాతీతుడుఅలాగే ఆయన చర్యలు కూడా వర్ణనకు అతీతంగా ఉంటాయి. అందువలన మన చర్యలతోమన బుద్ధితోమన సాధనతో దైవాన్ని అదుపు చేయగలమనిదైవాన్ని ఆకర్షించగలమని గట్టిగా నమ్మకండి. కనుక  దైవం మరియు దైవ సృష్టికి సంబంధించి మనకు ఉన్న అన్ని నమ్మకాలను వదిలేసి ప్రశాంతంగా మౌనంగా ఉండడమే ఉత్తమం.

 

ఇక్కడ దైవం తప్ప రెండవది లేనే లేదు కాబట్టి ఆయన గురించి మనం మాటలలో వర్ణించి చెప్పలేము. మనం మాట్లాడకుండా ఉండలేం కాబట్టి మన మాటలు చివరికి మౌనానికే దారితీయాలి. అలాగే దైవం మనల్ని సృష్టించాడని మనం భావిస్తేదైవంలో నుంచి దైవమే వస్తాడు మానవుడు రాలేడు. కారణంలో నుంచి కారణమే వస్తుంది కార్యం రాదు. పూర్ణంలో నుంచి పూర్ణమే వస్తుంది అసంపూర్ణం రాదు. పరమాత్మలో నుంచి పరమాత్మనే వస్తాడు జీవుడు రాడు. కాబట్టి మన నామరూపక్రియలను మనకున్న కష్టసుఖాలను కూడా మాటలలో వర్ణించలేము. ఎందుకంటే మన నామరూపక్రియలు, కష్టసుఖాలు కూడా దివ్యమైనవే కనుక.

 

రెండవది ఉన్నప్పుడే దానిని అర్ధం చేసుకోగలం మాటలలో వర్ణించగలం. కాని ఒకటే ఉంటే అర్ధం చేసుకోవడానికి వర్ణించడానికి ఏమీ ఉండదు. కేవలం దానితో ఏకమవ్వాలి తప్ప ఇంకేమీ చేయలేము. నిద్రలో మనం అదే చేస్తున్నాముకాని అక్కడ మనకు ఎరుక ఉండడం లేదు. నిద్రలో కూడా ఎరుక ఉంటే అదే ముక్తస్థితి. కనుక అన్ని పరిస్థితులలో మీరు మాటలలో వర్ణించలేని స్థితికి చేరిదానిలో తగినంత సమయం ఎరుకలో ఉన్నప్పుడే బ్రహ్మానందస్థితి లేదా సచ్చిదానందస్థితి ప్రత్యక్షమౌతుంది.

 

కనుక మీకున్న సమస్యకు కారణం - వాడుఅతడుఇది-అది లేదా నేను లేదా పరమాత్మ అని మీరు మాటలలో వర్ణించలేని స్థితికి వచ్చినప్పుడే మీకు దివ్యమైన స్థితి ప్రత్యక్షమౌతుందిఅలాగే ఫలితం కూడా వెంటనే లభిస్తుంది. అంటే పరమాత్మ కూడా కారణం అని చెప్ప లేని స్థితి ఏర్పడాలి. ఈ స్థితి ఏర్పడకుంటే మనం కార్యంపరమాత్మ కారణం అవుతాడు. ఇలా కారణాన్ని కార్యాన్ని స్పష్టంగా  వర్ణించి మాటలలో చెబితే మీరు ఒకటికంటే ఎక్కువ వాస్తవంగా ఉన్నాయని నమ్ముతున్నట్టు. దీని వలన ద్వంద్వ ప్రపంచంలో మీరు పరిమిత భాగమౌతారు. అప్పుడు మాయా ప్రపంచం మిమ్మల్ని కీలుబొమ్మలా ఆడిస్తుంది.

 

కనుక అది కారణంఇది కార్యం అని మాటలలో బంధించి స్పష్టంగా ఎవరైన చెబితేవాడు పూర్ణ జ్ఞాని కాదని గ్రహించిపరిమితమైన మాటలు 1% మాత్రమేనని అపరిమితమైన మౌనం 99% అని జడ్జ్ చేయండి. కనుక మీరనుకున్నది సాధించాలంటేఆ సమస్య మరియు దాని పరిష్కారం గురించి మాటలలో వర్ణించలేని స్థితికి చేరిమీరు ఆ వర్ణనాతీతస్థితితో లేదా మౌనంతో తగినంత సమయం ఏకమై ఉంటేనేమీరు అనుకున్నది సృష్టించు కోగలుగుతారని ఇక్కడ గ్రహించండి.

 

సమస్య-పరిష్కారం    

 

అలాగే అనారోగ్య లేదా ఆర్ధిక లేదా మరేదైనా ఒక సమస్య తీసుకుని దానికి సంబంధించిన నమ్మకాలు ఎలా మార్చాలిదీని గురించి వివరించండి అని నన్ను అడుగుతున్నారు. దీనికి నా సమాధానం ఏంటంటే, ఇక్కడ సమస్య అనారోగ్యమో లేదా ఆర్ధికమో కాదు. టోటల్ ప్రపంచమే సమస్య. ఎందుకంటే ప్రపంచంలో సమస్యనే ఉంటుందేగానీ పరిష్కారం ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో సమస్య కాదుప్రపంచమే సమస్య. ఒకవేళ మీకు ఈ ప్రపంచంలో పరిష్కారం లభించిన  అది తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తుంది.

 

అనారోగ్యానికి కారణం చెడు ఆహారమని వాతావరణమని ఇలా రకరకాలుగా మనం ఈ ప్రపంచంలోనే వెతుకుతూ ఉంటాం. అలాగే ఆరోగ్యానికి కూడా కారణం ఇక్కడే వెతుకుతాం. కానీ ఇవన్నీ సృష్టి అయినవి (Creations). ఒక సృష్టి మరొక సృష్టికి కారణం కాదుసృష్టించిన వాడే ఆ సృష్టికి కారణం. మంచి ఆహారం ఆరోగ్యానికి సృష్టికర్త కాదుచెడు ఆహారం అనారోగ్యాన్ని సృష్టి చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ సృష్టే  కనుకమీతో సహా ఇవన్నీ కూడా ఒకేసారి పుట్టి పెరిగి అంతమౌతున్నాయి కనుక. అంటే ఈ మాయా ప్రపంచం అనే సినిమాలో ఒక పాత్రను మరొక పాత్ర సృష్టి చేయలేదనిసూత్రధారి లేదా డైరెక్టరే పాత్రలను మరియు పాత్రల కష్టసుఖాలను సృష్టి చేస్తున్నాడని ఇక్కడ గ్రహించండి.

 

ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త(creator), ప్రపంచం పుట్టక ముందే ఉండిప్రపంచానికి అతీతంగా ఉంటాడే గాని ప్రపంచంలో ఏదో ఒకచోట పరిమితంగా బందీ అయి ఉండడు. అలాగే ఈ దైవానికి చావు-పుట్టుకలు ఉండవు. కనుక ఆరోగ్యాన్ని-అనారోగ్యాన్ని ఎవరైతే సృష్టించాడో వాడే కారణం. ఇక్కడ అనారోగ్య- ఆరోగ్యం, పాజిటివ్- నెగిటివ్ న్యూట్రల్.. ఇలా అన్నింటినీ సృష్టించినవాడు దైవం. కనుక ఆ దైవమే మూలం కారణం.

 

కనుక ఏ చిన్న సమస్యకు పరిష్కారం కావాలన్నాఈ అతీతంలో ఉన్న దైవంతో ఏకమవ్వాలి కాబట్టిఏదో ఒక సమస్య మీద దృష్టి పెట్టకుండాటోటల్ ప్రపంచాన్ని సమస్యగా భావించిప్రపంచానికి సంబంధించిన నమ్మకాలు మార్చాలి. అప్పుడే అతీతంగా ఉన్న దైవం ప్రత్యక్షమౌతాడు. కాబట్టి మీరు ఏది చూస్తున్న అది 1% మాత్రమే పరిమితంగా ఉంది, 99% అపరిమితంగా  ఉంది అని జడ్జ్ చేయండి.

 

అలాగే శరీరం వరకే పరిమితమై ఉన్న కష్టసుఖాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే వాటిని మీరు శరీరం వరకే పరిమితం చేసి బంధిస్తున్నారు. దీని వలన మీరు కూడా స్వేచ్ఛను కోల్పోయి శరీరం వరకే పరిమితమౌతున్నారు. కాబట్టి నాతో సహా నాకు ఉన్న కష్టసుఖాలన్నీ విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి అని భావించండి. అప్పుడు పరిమితంగా ఉన్న కష్టసుఖాలన్నీ దివ్యమైన శక్తులుగా పరివర్తన చెందుతాయి.

 

ఉదాహరణకు కాళ్ళ దగ్గరే నొప్పి ఉంటేఆ నొప్పి కేవలం కాళ్ళ దగ్గరే ఉంది అని మీరు భావించిదానిని మీరు కేవలం అక్కడే అనుభూతి చెందితేఅది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా నొప్పి శరీరం అంతా విశ్వమంతా వ్యాపించి ఉందని భావించి దానిని అనుభూతి చెందితేఅప్పుడు మీకు అది ఆనందానుభూతిని ఇస్తుంది. అలాగే మంచి లేదా తటస్థం లేదా దివ్యానుభూతులను ఏదో ఒక భాగంలో అనుభూతి చెందితేమొదట్లో మీకు హాయిగా ఉండవచ్చు. కాని అది కూడా కొంత సమయం తర్వాత దుఃఖాన్ని కలిగిస్తుందిఎందుకంటే వాటిని మీరు పరిమితంగా చేసి బంధిస్తున్నారే గానివాటి సహజ స్థితియైన అపరిమిత తత్వాన్ని తెలుసుకుని వాటిని అపరిమితంతో ఏకం చేయడం లేదు కనుక.

 

వాస్తవానికి మీతో సహా లోపల-బయట ఉన్న అన్ని శక్తులు  ఒకేసారి అపరిమితంగా ఉంటూనే పరిమితంగా కూడా ఉన్నట్టు నటిస్తున్నాయి. అంటే ఉన్నది అపరిమితమేపరిమితమైన దానికి ఉనికే లేదుపరిమితమైనది నీడలాంటిది. కనుక ఏ శక్తి అయినా పరిమితంగా ఉంది అని భావిస్తే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనిఎప్పుడూ అపరిమితంగా పరిమితంగా ఒకేసారి ఉంటుంది అని భావిస్తే, అది దివ్యమైన శక్తిగా పరివర్తన చెందుతుందని దివ్యమైన ఫలితాలను కూడా అందిస్తుందని ఇక్కడ గ్రహించండి.

మామూలుగా భిన్నత్వంలో ఉన్నప్పుడు సమస్య లోపల ఉంది పరిష్కారం బయట ఉంది అని భావిస్తాము. అంటే అనారోగ్య సమస్యకు ఎక్కడో ఉన్న వైద్యుడు ఎక్కడో ఉన్న మందులే పరిష్కారమని, బీదరికానికి ఎక్కడో ఉన్న ధనమే పరిష్కారమని భావిస్తాము. కానీ ఏకత్వంలో సమస్య  ఇక్కడే ఉంటుంది పరిష్కారం కూడా ఇక్కడే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అదే సమస్య మరియు అదే పరిష్కారం కూడా. ఉదాహరణకు ప్రపంచమే సమస్య ప్రపంచమే పరిష్కారం కూడా, అనారోగ్యమే సమస్య అనారోగ్యమే పరిష్కారం కూడా, బాంధవ్యమే సమస్య బాంధవ్యమే పరిష్కారం కూడా, బీదరికమే సమస్య బీదరికమే పరిష్కారం కూడా. అంటే బీదరికాన్ని 1%గా భావించి బీదరికంలోనే ఉన్న  99% నిరాకారాన్ని పరిష్కారంగా భావిస్తే సరిపోతుంది. అంటే బీదరికంతో పాటు మిగతావన్నీ పరిమితంగా 1% మాత్రమే ఉన్నాయని, 99% నిరాకారంగా అపరిమితంగా ఉన్నాయని అర్థం చేసుకొని, దానిని అనుభవంలోకి తెచ్చుకుంటే సరిపోతుందని ఇక్కడ గ్రహించండి. 

 అలాగే ఈ దైవం నేనే సృష్టికర్తను నేనే సృష్టినిఉన్నది నేనే ఉన్నది ఏకమేనా గురించి మాటలతో వర్ణించి స్పష్టంగా చెప్పలేరు అని అంటున్నాడు కాబట్టిఈ మాటలన్నింటినీ వదిలేసి వర్ణనాతీతస్థితికి చేరండి.

 

Divine Will-Free Will

 

కనుక నేను ఎలా ఉన్నాఎలా ప్రవర్తించిన ఎలాంటి నమ్మకాలను గట్టిగా పట్టుకున్నాఅలాగే  జీవుళ్ళుజగత్తుఈశ్వరుడుమాయాశక్తి మొదలైన వాటి ప్రభావం నా మీద ఎంత ఉన్నా కూడా,  ఇవేవి అపరిమితమైన దైవంతో నేను ఏకం అవ్వకుండా అడ్డుకోలేవుఎందుకంటే అందరినీ కీలు బొమ్మలా ఆడించేది ఈ అపరిమితమైన దైవమే. దీనిని గ్రహించిఈ భావాన్ని ఈ నమ్మకాన్ని  గట్టిగా పట్టుకోండి.

 

 మీరు ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నామీరు పిలిచినా పిలువకపోయినాపరిమితమైన నమ్మకాలతో మిమ్మల్ని మీరు నిర్బంధించుకున్నా కూడాఅపరిమిత దైవం తన ఇష్టానుసారంగా మీ జీవితంలో ప్రత్యక్షమౌతాడు అలాగే మాయమౌతాడు కూడా. అలాగే మీరు ఊహించని ఫలితాలను ఇస్తాడు, అలాగే మీ వద్ద ఉన్నవి ఊహించని విధంగా లాక్కుంటాడు కూడా.  ఇక్కడ  మీరు దైవాన్ని ఏమాత్రం అదుపు  చేయలేరు. దీనిని భగవదిచ్చ (Divine Will) అని అంటారు.

 

 ఒకవేళ వర్తమానస్థితిలో ప్రశాంతంగా తగినంత సమయం మీరు ఉంటే - మీతో సహా దేనిని మార్చవలసిన అవసరం లేదు, అంతా పర్ఫెక్ట్ గా జరుగుతోంది అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారు, సృష్టి అంతా పర్ఫెక్ట్‌గా ఉంది అనే దివ్యానుభవం మీకుంటేనేను తప్ప ఇంకెవరూ లేరు అనే ఏకత్వానుభవం మీకుంటే(Oneness), పరమాత్మ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అనే ఏకత్వానుభవం మీకుంటే (Singularity, Unity), అప్పుడు మీకు సంకల్ప స్వేచ్ఛ (Free Will) లభిస్తుంది. ఇలాంటి దివ్యమైన స్థితితో మీరు ఏకమై ఉన్నప్పుడుకోరిన అనుభవాన్ని మీరు వెంటనే సృష్టించుకోగలుగుతారు. అంటే మీరు కూడా పరమాత్మలాగా సృష్టి స్థితి లయాలు చేయగలుగుతారన్నమాట.

 

కనుక మీ వద్ద ఉన్నది పరమాత్మ అకస్మాత్తుగా లాక్కుంటే, లేదా ప్రారబ్దం ప్రకారం మీకు ఏదైనా సమస్య వస్తేఅప్పుడు మీ సంకల్ప-స్వేచ్ఛను ఉపయోగించుకొని మీరు  మీ సమస్యకు వెంటనే పరిష్కారాన్ని పొందవచ్చు లేదా మీకు కావలసిన దానిని వెంటనే సృష్టించుకోవచ్చు అనే విషయాన్ని ఎల్లప్పుడూ ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉన్నప్పుడు మదిలో ఉంచుకోండి.

 

అంటే ద్వంద్వ ప్రపంచంలో లేదా మాయ ప్రపంచంలో మనం పరిమితమైన భాగంగా ఉంటే మనకు సంకల్ప స్వేచ్ఛ ఉండదనిఏకత్వ ప్రపంచంతో లేదా దివ్యమైన ప్రపంచంతో ఏకమై ఉంటేనే మనకు సంకల్ప స్వేచ్ఛ ఉంటుందని ఇక్కడ గ్రహించండి.

 

స్థూలం నుంచి సూక్ష్మం వైపు - Quantum Vision

 

మనం మామూలుగా శరీరం అవయవాలతో తయారైందని భావిస్తాం. కానీ మనం ఎప్పుడైనా కింద పడ్డప్పుడు, ఎముకలు విరిగాయా లేదా అని తెలుసుకోవడానికి ఎక్సరే (Xray) తీయిస్తాం.  అలాగే శరీరంలో ఏదైనా గడ్డ ఉంటే క్యాన్సరా కాదా అని తెలుసుకోవడానికి పెట్ స్కాన్ (Pet Scan) చేయిస్తాం. ఈ పెట్ స్కాన్ లో మనకు ఎముకలు ఏమాత్రం కనబడవు, కేవలం కణాలు (Cells) మాత్రమే కనబడతాయి.

 

అలాగే ఈ కణాలు దేనితో తయారైనాయి? ఈ కణాలు మాలిక్యుల్స్ తో, అలాగే మాలిక్యుల్స్ అణువులతో తయారైనాయి. ఇక్కడ ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి? అవయవాలు ఒరిజినలా, అణువులు ఒరిజినలా? వాస్తవానికి ఇక్కడ ఒరిజినల్ - అణువులు, డూప్లికేట్ - అవయవాలు.

 

అలాగే అణువులు దేనితో తయారైనాయని తెలుసుకోవడానికి దాని లోపలికి వెళ్లి చూస్తే, అందులో 99% నిరాకరం, 1% మాత్రమే ఆకారం ఉంది. మళ్లీ ఇక్కడ ఒరిజినల్ ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే,  అప్పుడు ఒరిజినల్ అణువులు కాదని, ఒరిజినల్ నిరాకారమని అదే రకరకాల ఆకారాలలో ఉన్నట్టు కనబడుతోందని (One existence appearing as many) మనకు తెలుస్తుంది.

 

కనుక మీరు వాస్తవాన్ని (Original) పట్టుకొని అవాస్తవాన్ని (Duplicate) వదిలేయండి. ఈ డూప్లికేట్లు వాస్తవంగా లేవు, ఉన్నాయని మనం నమ్ముతున్నాం అంతే. అంటే నామరూపక్రియలు, కష్టసుఖాలు, గెలుపోటములు, శరీర అవయవాలు,  ఆరోగ్య అనారోగ్యాలు, ఇలా విశ్వంలో ఉన్న అన్ని కూడా ఉన్నాయనేది ఒక భ్రమ మాత్రమే, ఒక నమ్మకం మాత్రమే, వాస్తవానికి ఉన్నది ఇక్కడ కేవలం నిరాకారం (Pure energy, Pure Consciousness) మాత్రమే. కనుక  ఈ నిరాకారమే రకరకాల తాత్కాలిక రూపాల్లో ఉన్నట్టు కనబడుతోందని (Temporary Forms) ఇక్కడ గ్రహించండి.

 

అంటే ఇక్కడ కళ్ళు అంటే ఇంద్రియాలు సరిగ్గా పని చేయట్లేదని, వాస్తవాన్ని చూపించట్లేదని మనం ఒప్పుకుంటున్నాం. వీటివల్ల మనకు ఈ సృష్టి రహస్యం అర్థం కావట్లేదు. అందుకే మనం సూక్ష్మమైన అద్దాలు కలిగిన ఎక్స్ రేలను, పెట్ స్కాన్లను ఉపయోగించుకుంటున్నాం. వీటి ద్వారానే ఇది మంచి అని ఇది చెడు అని నిర్ధారించుకుంటున్నాము. అయినప్పటికీ వీటివల్ల మనకు శాశ్వతమైన పరిష్కారం లభించట్లేదు. ఎందుకంటే ఈ మంచి చెడులు స్థిరంగా (Stable) ఉండకుండా ఎప్పుడు మారుతూనే పరివర్తన చెందుతూనే ఉంటాయి (Always Changing Mutating Transforming). వీటిని గట్టిగా పట్టుకోవడం వలన మనము సమతుల్యతను (Balance) కోల్పోయి ఎప్పుడు అసమతల్యంగానే (Imbalance) ఉంటాము.

 

ఎలాగూ మనకు సూక్ష్మంగా చూడాలనే తపన ఉంది కాబట్టి,  ఇప్పటి నుంచి మరింత సూక్ష్మంగా చూడగలిగే టాలెంట్ కలిగి ఉన్న క్వాంటం అద్దాలతోటి (Quantum Vision) ఈ ప్రపంచాన్ని చూద్దాం. అప్పుడే మనకు శాశ్వతమైన (Permanent Eternal) పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శాశ్వతంగా ఉన్న శక్తి మాత్రమే వాస్తవంగా ఉందని తెలుస్తుంది. కనుక స్థూలం నుంచి సూక్ష్మం వైపు ప్రయాణం చేసి (From Forms to Cells to Molecules to Atoms to Subatomic particles to Energy) , అత్యంత సుక్ష్మంగా ఉన్న నిరాకరశక్తితో ఏకమౌదాం.

 

సాధన

 

క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ సృష్టిలో ఉన్న ప్రతీ అణువు 1% మాత్రమే ఆకారంతో(Particle), 99% నిరాకారం(Wave)తో తయారైంది. కనుక మీరు కళ్ళు తెరిచి ఎరుకలో ఈ ప్రపంచంతో ఉన్నప్పుడుఇంద్రియాల ద్వారా మీరు బయట లోపల దేనిని గ్రహించినాఇది 1% మాత్రమే ఆకారమని(శబ్ద స్పర్శ రూప రస గంధాలు, see smell taste touch hear), 99% నిరాకారమని (Independent Bliss) జడ్జ్ చేయండి.

 

అలాగే మీ జీవితంలో ఏది జరుగుతున్నాదేనినీ మార్చాల్సిన అవసరం లేదుఅంతా పర్ఫెక్ట్ గా జరుగుతోందిఅందరూ దైవం సహాయంతో దివ్యంగా ఉంటూ దివ్యమైన పనులు చేస్తున్నారుసృష్టి అంతా పర్ఫెక్ట్ గా ఉందిఅంతా దివ్యంగా జరుగుతోంది అనే భావనను ఎల్లప్పుడూ కొనసాగించాలి. ఒకవేళ మీకు ఇది తప్పు ఇది ఒప్పు అని అనిపిస్తేమీరు తప్పు-ఒప్పులలో ఇరుక్కుంటేమీ జీవితంలో అనుకున్న విధంగా జరగట్లేదని అనిపిస్తేవెంటనే ఆ భావనను మార్చి అంతా పర్ఫెక్ట్ గా జరుగుతోందని అంతా దివ్యంగా జరుగుతోందని జడ్జ్ చేయండి. ఇలా మీరు జడ్జ్ చేస్తూ ఈ దివ్యానుభూతిని కొనసాగించినప్పుడే మీకు సంకల్ప స్వేచ్ఛ ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

 

కనుక  జీవితంలో ఎదురౌతున్న పరిస్థితులకు తగ్గట్టు బయట నటిస్తూలోపల 1% మాత్రమే ఉన్న మంచి-చెడులకు గెలుపోటములకు విలువను ఇవ్వకుండాముందు మీరు అంతా దివ్యంగా జరుగుతోందనే భావనకు ప్రాముఖ్యతనిస్తూ, ఈ భావాన్ని ఈ అనుభూతిని  అంతరంలో కొనసాగించండి. ఎందుకంటే మన లక్ష్యం గెలుపోటములు కాదుసంకల్ప-స్వేచ్ఛ కనుక. దైవ సృష్టిలో ఉన్న అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి (Accept as it is) అన్నింటినీ సమానంగా గౌరవించినప్పుడే, మనకు సంకల్ప స్వేచ్ఛ (Free Will) లభిస్తుంది కనుక. ఎందుకు ఓడిపోతున్నామో, ఎందుకు గెలుస్తున్నామో  అర్థం కాని అయోమయ స్థితిలో ఉండకుండాసంకల్ప స్వేచ్ఛతో అనుకున్న వెంటనే సృష్టిస్థితిలయాలు చేయడమే మన లక్ష్యం కనుక.

 

మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు 1% మాత్రమే ఉన్న పరిమిత ఆకారాలనుఆలోచనలనుఅనుభూతులనుఅన్ని వ్యతిరేకాలనుఅన్ని ద్వంద్వాలనుఅన్ని అపరిమితమైన  నమ్మకాలనుఅన్ని సమస్యలను మరియు అన్ని పరిష్కారాలనుఒరిజినల్ దైవం-Man Made God ను, Divine Will-Free Will నునేను మీకు ఇన్ని సంవత్సరాల నుండి చెప్పిన జ్ఞానాన్నిఅలాగే మీకు తెలిసిన మొత్తం జ్ఞానాన్నిచివరికి అన్ని మాటలను కూడా వదిలేసితగినంత సమయం ప్రశాంతంగా లేదా మౌనంగా ఉంటే లేదా వాటితో అంటి ముట్టనట్టుగా ఉంటేలేదా వర్ణనాతీత స్థితిగా ఉంటేఆనంద స్థితి లేదా నిరాకార స్థితి దానంతటదే ప్రత్యక్షమౌతుంది.

 

ఎలాగైతే ఉప్పును నీళ్లలో కలపడం వలన ఉప్పదనం అనేది నీళ్లు మొత్తం వ్యాపిస్తుందోఅలాగే 1% పరిమిత మంచి-చెడు ఆకారాలను పరిమిత-అపరిమిత నమ్మకాలనుప్రత్యక్షమైన 99% అనంతమైన నిరాకార స్థితిలో కలపండి. ఇలా ఏకం చేయడం వలన ఆకారాలు కూడా  అనంతమౌతాయి. అలాగే మీరు కూడా అనంతంతో ఏకం అవ్వండి. ఇలా పరిమితమైనవి అనంతం అవ్వడం వలనజీరో స్టేట్ లేదా శూన్యస్థితి లేదా ఏకత్వ స్థితి లేదా బ్రహ్మానంద స్థితి ప్రత్యక్షమౌతుంది.

 

ఇలా ఆకారాలు అంటే దేశకాలవస్తువులుజీవజగదీశ్వర్లుప్రారబ్దం ఆగామి సంచిత కర్మలుగతము భవిష్యత్తు వర్తమాన జ్ఞాపకాలుపాజిటివులు నెగెటివులు న్యూట్రల్లుజీవాత్మలు ఆత్మలు పరమాత్మలు...  మొదలైనవన్నీ నిరాకారంతో కలిసి ముద్దగా ఏకమవ్వడం వలనద్వంద్వ విభజన మాయమై ఏకత్వం ఏర్పడుతుంది. ఏకత్వస్థితిలోముద్ద స్థితిలోసచ్చిదానంద స్థితిలో అన్ని ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే ఉంటాయి.

 

మీకు మరియు మీకు కావాల్సిన దానికి మధ్య దూరం ఉన్నప్పుడేఅనుకున్నది జరగడానికి సమయం పడుతుంది. కానీ ఏకత్వ స్థితిలో మీకు మరియు మీకు కావాల్సిన దానికి మధ్య దూరం అనేదే ఉండదు. కాబట్టి అనుకున్న వెంటనే మీ సంకల్పం నెరవేరుతుంది. ఇలా అనుకున్న వెంటనే ప్రతి దానిని సృష్టిస్తూ (Create Instant Results), నేనే సృష్టికర్తను అని అనుభవపూర్వకంగా తెలుసుకోండి.

 

నమ్మకాలు టాపిక్‌ని ఆడియోల రూపంలో వినడానికి ఈ లింకును క్లిక్ చేయండి

https://youtube.com/playlist?list=PL7sfndcUtXfnCxnPiGEJDrQUCkXHcllbl&si=6Ez060bd3kk55jW9

 

కష్ట-సుఖాలను అమృతంగా పరివర్తన చేయడం ఎలా అనే విషయం తెలుసుకోవడానికి ఈ లింకులను క్లిక్ చేయండి..

https://www.youtube.com/post/Ugkxytw_ftw4Io5Qt22_sqhu-qybCJ7kAQ9L

 

కరిగిపోండి గైడెడ్ మెడిటేషన్ చేయడానికి ఈ లింకును క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=zZuyTTKSIs4&t=0s

ముద్ద గైడెడ్ మెడిటేషన్ చేయడానికి ఈ లింకును క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=_cmfTekSJpE&t=0s

 

 

Comments

Popular posts from this blog

1. న్యూ ఎనర్జీ పాంప్లెట్

3. మిత్రత్వం